"Siva" movie "botany paatamundi" song - the most popular one from sirivennela
బోటనీ పాఠముంది - మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా
హిస్టొరీ లెక్చరుంది - మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టురా
||ప|| |అతడు2|
బోటనీ క్లాసంటే బోరు బోరు హిస్టరీ రొష్టు కన్న రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు - బ్రేకులూ డిస్కోలూ చూపుతారు
|ఖొరస్| జగడ జగడ జగడ జగడజాం ||4||
.
|ఆమె|
దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు - ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు - ఎవ్వడీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేంస్ బాండు గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే జీడి బ్యాండు ఫోజులే చూస్తుంటే ఒళ్లు మండు
|ఖొరస్| జగడ జగడ జగడ జగడజాం ||4||
.
||చ||
|అతడు2|
అయ్యో మార్చినే తల్చుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా
|అతడు1|
ఎయ్ ఛీ తాళం రాదు మార్చిట మార్చి తాళంలో పాడరా వెధవా
|అతడు2|
మార్చినే తల్చుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏంటిరో ఇంత గొడవ
|అతడు1|
ఎందుకీ హైరానా వెర్రి నాన్న వెళ్లరా సులువైన దారిలోన
|ఆమె|
ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా
.
||చ||
|అతడు1|
మాగ్జిమం మార్కులిచ్చు మ్యాథ్సులో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్లు వంచరా ఒరేయ్
|ఖొరస్| తందనా తందననా||3||
|ఆమె|
క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పైపెట్టు కాస్త ఫస్టు ర్యాంకు పొందవచ్చురోయ్
|ఖొరస్| తందనా తందననా||3||
|అతడు2|
అరె ఏంటి సార్!!లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతారు
పుస్కాల్తో కుస్తీలు పట్టేటోల్లు సర్కారి క్లర్కులై ముర్గిపోతరూ
|ఖొరస్| జగడ జగడ జగడ జగడజాం ||4||
Comments [0]